22-10-2025 01:51:51 AM
-ఇంటిలో గొడవ పడి ఏడుపాయలకు వచ్చిన రేణమ్మ
పాపన్నపేట, అక్టోబర్ 21(విజయక్రాంతి) : ఇంటిలో గొడవపడి వెళ్లి మంజీర నదిలో దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఏడుపాయలలో మంగళవారం వెలుగుచూసింది. పాపన్నపేట ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం రామాయంపేట మండలం కోమట్‌పల్లికి చెందిన రేణమ్మ (45) సోమవారం ఇంటిలో గొడవ పడి ఏడుపాయలకు వచ్చింది. మొదటి బ్రిడ్జి వద్ద మంజీర నదిలో దూకింది. కుటుంబీకులు చుట్టూ పక్కల వెతికారు. ఆచూకీ లభించక పోవడంతో స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేశారు. కాగా మంగళవారం సాయంత్రం నదిలో ఆమె మృతదేహం కనిపించడంతో పోలీసులు ఆమె భర్త మల్లేష్‌కు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.