calender_icon.png 15 August, 2025 | 7:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

వాగులో కొట్టుకుపోయి మహిళ మృతి

15-08-2025 01:15:57 AM

వెంకటాపురం నూగూరు(విజయక్రాంతి): ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలెం వాగులో బుధవారం కొట్టుకుపోయి మహిళ మృతిచెందింది. మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఇరుప లక్ష్మి కుమారుడు బుధవారం పశువులు మేపడానికి వాగు అవతలి వైపు ఉన్న మట్ల గూడెం వైపు వెళ్లాడు. కుమారుడి కోసం లక్ష్మి పాలెం వాగు దాటుతుండగా.. నీటి ప్రవాహం పెరిగడంతో కొట్టుకుపో యింది. కుటుంబ సభ్యులు వెతకగా గురువారం వాగులో శవమై కనిపించింది.