calender_icon.png 24 January, 2026 | 7:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేషన్ దుకాణం కోసం.. కలెక్టరేట్ ముందు మహిళ నిరసన

23-09-2024 04:32:26 PM

నిర్మల్,( విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం తనకు మంజూరు చేసిన రేషన్ దుకాణాన్ని తనకు ఇప్పించాలని కోరుతూ జంగం రమాదేవి కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. 10 సంవత్సరాల క్రితం ఎస్సీ సామాజిక వర్గంలో రేషన్ దుకాణం కోసం దరఖాస్తు చేసుకోవడంతో తనకు మంజూరైందన్నారు. అయితే తన వద్ద నుంచి పట్టణానికి చెందిన సాయి చరణ్ తీసుకొని నిర్వహిస్తున్నారని తెలిపింది. తన రేషన్ దుకాణం తనకు ఇవ్వామని అడిగితే వేధింపులకు గురిచేస్తున్నాడని వాపోయింది. తనకు న్యాయం చేయాలని ఆమె కలెక్టర్ ను కోరింది.