calender_icon.png 24 January, 2026 | 8:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వన మహోత్సవంలో మొక్కలు పంపిణీ

23-09-2024 04:47:02 PM

యాదాద్రిభువనగిరి,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా సోమవారం భువనగిరి పట్టణంలోని 16, 17వ వార్డుల యందు ఇంటింటికి పూల మొక్కలు, పండ్ల మొక్కలను (దానిమ్మ, ఉసిరి, మందార, జామ, నిమ్మ, మల్లెపువ్వు) ఇతరతర మొక్కలను మున్సిపల్ చైర్ పర్సన్ పోతంశెట్టీ వేంకటేశ్వర్లు పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రతి ఇంటికి 6 మొక్కల చొప్పున పంపిణీ చేయబడుతాయని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి ఇట్టి మొక్కలను నాటి వాటి యొక్క సంరక్షణ బాధ్యతలు చూసుకోవాల్సిందిగా కోరారు. అందరూ కూడా పర్యావరణ పరిరక్షణ కొరకై కంకణ బదులు కావాలని పిలుపునివ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో వార్డు సభ్యులు కడారి ఉమాదేవి వినోద్ కుమార్, వార్డు అధికారి, పురపాలక అధికారులు, రిసోర్స్ పర్సన్లు, సిబ్బంది, వార్డు ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.