అన్నం పెట్టిన ఇంటికే కన్నం

27-04-2024 01:51:52 AM

యజమాని ఇంట్లోనే చోరీకి పాల్పడిన మహిళ 

రూ.38 లక్షల విలువైన బంగారం, కారు స్వాధీనం

వరంగల్, ఏప్రిల్ 26 (విజయక్రాం తి): అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసింది ఓ మహిళ. యజమాని ఇంట్లో మరో ఇద్దరితో కలిసి చోరీకి పాల్పడి పోలీసులకు చిక్కింది. వరంగల్ పోలీస్ కమి షనర్ అంబర్ కిశోర్‌ఝా శుక్రవారం మీడియాకు నిందితుల వివరాలను వెల్లడించారు. సూర్యాపేట జిల్లా బిల్యానా యక్ తండాకు చెందిన కత్రి కల్యాణి వరంగల్‌రంగశాయిపేటలో నివసిస్తోం ది. కొంతకాలంగా హనుమకొండలోని సంతోష్‌నగర్‌కు చెందిన డాక్టర్ కీసర ఇంద్రారెడ్డి ఇంట్లో పనిచేస్తోంది.

ఈ క్రమంలోనే యజమాని ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలపై కన్నుపడ్డ కల్యా ణి ప్రియుడు నెక్కొండ మండలం మూడుతండాకు చెందిన మూడు చంటి,  నెల్లికుదురు మండలం అవుసలతం డాకు చెందిన అక్క మౌర్య సునీతతో కలిసి ఫిబ్రవరిలో నాలుగు దఫాలుగా 650 గ్రాముల బంగారు ఆభరణాలను దొంగిలించారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం సుబేదారీ పోలీసుకలిసి ఫారెస్ట్ ఆఫీస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా కారులో అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించారు. డాక్టర్ ఇంద్రారెడ్డి ఇంట్లో దొంగతనం చేసింది వారేనని తేలింది. నిందితుల నుంచి రూ.38 లక్షల విలువైన నగలు, కారు స్వాధీనం చేసుకొని, అరెస్ట్ చేసినట్లు సీపీ తెలిపారు.