14-09-2025 05:14:48 PM
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు
కామారెడ్డి,(విజయక్రాంతి): ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఎంతో అండగా నిలుస్తుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లక్ష్మీదేవి గార్డెన్లో తాడువాయి, రామారెడ్డి, సదాశివ నగర్, రాజంపేట మండలాల కు చెందిన 53 మంది లబ్ధిదారులకు 17,57,500 రూపాయలు చెక్కులను ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య సేవలు పొందేందుకు అండగా నిలబడడం ఎంతో సంతృప్తికరమైన విషయం అన్నారు.
ఇప్పటివరకు అత్యధికంగా సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసి చెక్కులను పంపిణీ చేయడంలో ఎల్లారెడ్డి నియోజకవర్గం రాష్ట్రంలోని మొదటి స్థానంలో ఉందన్న విషయాన్ని గర్భంగా చెప్పగలగడం ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వం ఇచ్చే అందే సాయం ప్రతి ఒక్కరికి సమర్థంగా అందేలా ప్రత్యేకంగా నిర్మించబడిన తమ టీం 24 గంటల పాటు పనిచేస్తుందని ఆయన వెల్లడించారు. వైద్య అవసరాలకు ఎవరైనా సాయం కావాలంటే ఎల్లప్పుడూ తన సాయం అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య సహాయ పథకాలు ఎన్నో కుటుంబాలకు జీవనధారంగా మారుతున్నాయని పేర్కొన్నారు. అవసరమైన ప్రతి ఒక్కరికి సరైన సమయంలో సరైన విధంగా సాయం అందించడమే ఆ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు.