calender_icon.png 14 September, 2025 | 6:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వార్త విలేకరి కట్కూరి మొగిలిపై చర్యలు తీసుకోవాలి

14-09-2025 04:53:51 PM

ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేసిన హమాలీ సంఘం నాయకులు

చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మండల కేంద్రానికి చెందిన వార్త విలేకరి కట్కూరి మొగిలిపై చర్య తీసుకోవాలని కోరుతూ హమాలీ సంఘం నాయకులు ఆదివారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  గతంలో తమకు దానం చేసిన ఆరుగుంటల భూమిని వ్యక్తిగత కారణాల దృశ్య అందరం కలిసి  అమ్ముకోవడం జరిగిందని తెలిపారు. దీనిపై వార్తా విలేకరి కట్కూరు మొగిలి అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాడని చెప్పారు.

సాక్షర భారత్ కోఆర్డినేటర్ గా మొగిలి పనిచేసే ఉద్యోగుల దగ్గర నెలకు 2000 చొప్పున వసూలు చేశాడని ఆరోపించారు. సామాన్య ప్రజల వద్ద వితంతు,వృద్ధాప్య పింఛన్లు,బీసీ కార్పొరేషన్ రుణాలు ఇప్పిస్తానని వసూళ్లకు పాల్పడినట్లు తెలిపారు. సమాజంలో జర్నలిజంకి మాయని మచ్చ తీసుకొచ్చినటువంటి వార్త విలేకరిని వెంటనే  తొలగించాలని డిమాండ్ చేశారు. ఆరు నెలల క్రితం రాంనగర్ కాలనీకి చెందిన ఇద్దరు మహిళలను మద్యం మత్తులో చౌరస్తాలో నానా బూతులు తిట్టడం వల్ల వారు పోలీస్ స్టేషన్లో  ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. హమాలీలమైన మాపైన కూడా నిరాదనమైన ఆరోపణలు చేస్తూ లబ్ధి పొందాలని చూస్తున్నాడని, తమకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు.