calender_icon.png 14 September, 2025 | 6:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ కార్యకర్తల కంటికి రెప్పలా కాపాడిన ఘనత దామోదర్ రెడ్డి

14-09-2025 05:01:37 PM

తుంగతుర్తి,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి జన్మదిన వేడుకలను తుంగతుర్తి మండల కేంద్రంలోని ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాగేల్లి అరుణ్ కుమార్, కోరి కొప్పుల నరేష్ గౌడ్ అధ్యక్షతన ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యకర్తలు అభిమానులు భారీ కేక్ ఏర్పాటు చేయగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, చెవిటి వెంకన్న యాదవ్, మహిళా కమిటీ అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు కార్యకర్తలతో కలిసి కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి దామోదర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఎన్ని ఆటుపోట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ జెండాను విడవకుండా కార్యకర్తలను కంటికి రెప్పల కాపాడుతూ సూర్యాపేట తుంగతుర్తి నియోజకవర్గాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఎవరు ఎన్ని కుట్రలు పండిన ఆయన నాయకత్వంలో రాబోయే రోజుల్లో తుంగతుర్తి పూర్వ వైభవం సంతరించుకుంటుందన్నారు. వచ్చే స్థానిక సంస్థలు ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.