14-09-2025 05:24:00 PM
తప్పుడు పత్రాలతో సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం తగదు
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇప్పకాయల నరసయ్య
రేగొండ,(విజయక్రాంతి): తప్పుడు జీవో పత్రాలతో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి సోషల్ మీడియాలో చేస్తున్న అసత్య ప్రచారాలు తగదని రేగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇప్ప కాయల నరసయ్య అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం మండల నాయకులతో కలిసి పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గత నాలుగు రోజుల క్రితం ఉమ్మడి మండలంలోని చెంచుపల్లి గ్రామం నుండి చెన్నాపురం గ్రామం వరకు రూ.1.43 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
దీన్ని రాజకీయం చేస్తూ బిఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తప్పుడు పత్రాలతో బిఆర్ఎస్ ప్రభుత్వంలోనే శిలాఫలకం వేసినట్టు ఆ నిధులు వారే తెచ్చినట్టు సోషల్ మీడియాలో తన అనుచరులతో ప్రచారం చేయడం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పై ఫేక్ ప్రచారం చేస్తూ బురద జల్లె ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.నియోజకవర్గ ప్రజలు అన్ని గమనిస్తున్నారని నిత్యం ప్రజల మధ్య ఉండే నాయకున్ని పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడే వ్యక్తి ని ఇలా చేయడం సిగ్గుచేటన్నారు. గత ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి, నీకు తగిన గుణపాఠం చెప్పిన ఇంకా బుద్ధి రాలేదని రాబోయే ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కదని హెచ్చరించారు.