11-12-2025 12:39:34 AM
చర్ల,డిసెంబర్ 10 (విజయక్రాంతి): మా వోయిస్ట్ పార్టీకి చెందిన 11 మంది సీనియర్ సభ్యులు బుధవారం మహారాష్ట్ర డిజీపీ రష్మీ శుక్లా ముందు లొంగిపోయారు. వీరిలో ఇద్ద రు డివిజనల్ కమిటీ సభ్యులు, ముగ్గురు ప్లాటూన్ పార్టీ కమిటీ సభ్యులు, ఇద్దరు ఏరి యా కమిటీ సభ్యులు, నలుగురు సాధారణ పార్టీ సభ్యులు ఉన్నారు. వారిపై మొత్తం రూ 8.2 మిలియన్లు రివార్డు ప్రకటించారు.వీరు తమ యూనిఫాంలు, ఆయుధాలతో లొంగిపోయారు.
లొంగిపోయిన వారిలో 57 ఏళ్ల రమేష్ అలియాస్ భీమా అలియాస్ బాజు గుడ్డి లేకామి భమ్రాగడ్ ప్రాంతానికి చెంది న డివిజనల్ కమిటీ సభ్యుడు. ఇతర సభ్యు లు ఛత్తీస్‌గడ్‌లోని సుక్మా, బీజాపూర్, కాం కేర్, నారాయణ్‌పూర్ జిల్లాలకు చెందినవారు. లోంగిపోయిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. మహారాష్ట్ర డీజీపీ రష్మి శుక్లా రెండు రోజుల పర్యటన నిమిత్తం గడ్చిరోలికి వచ్చారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ పెద్ద సంఖ్యలో మావోయిస్టు కార్యకర్తలు లొంగిపోతున్నారన్నారు. మిగిలిన మావోయిస్టులు ఆయుధాలు వదలి గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డీజీపీ సీ-60 కమాండోలు, అధికారులను కూడా సత్కరించారు. కార్యక్రమంలో ఏడీజీ (స్పెషల్ ఆపరేషన్స్) డాక్టర్ త్సెరింగ్ డోర్జయ్, డీఐజీ అంకిత్ గో యల్, ఎస్పీ నీలోత్పాల్ సహా పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.