calender_icon.png 28 November, 2025 | 1:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కర్ణాటకలో ‘మాట’ యుద్ధం

28-11-2025 12:32:01 AM

-ఎక్స్ వేదికగా డీకే, సిద్ధరామయ్య ఒకరిపై మరొకరు కౌంటర్లు

-అంతర్గత సమస్యపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి

-కీలక నేతలతో త్వరలో సమావేశం

-ప్రకటించిన మల్లికార్జున ఖర్గే

బెంగళూరు, నవంబర్ 27: కర్ణాటక  కాంగ్రె స్‌లో కొనసాగుతున్న అధికార పోరు రోజు రోజుకూ రసవత్తరంగా మారుతోంది. నాయ కత్వ మార్పుపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య సయోధ్య కుదిరందని ప్రచారం జరుగుతున్న వేళ ఇద్దరు నేతలు ఎక్స్ వేదికగా ‘మాట’ యుద్ధానికి తెరలేపడం చర్చనీయాంశమైంది. దీనిపై వెంటనే స్పందించిన పార్టీ అధిష్టానం త్వరలో కీలక నేతలతో సమావేశం ఏర్పాటు చేసి అంతర్గత సమస్యను పరిష్కరిస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటిం చడంతో కర్ణాటక రాజకీయం ఢిల్లీకి మారింది. 

మాట నిలబెట్టుకోవడం అంటే.. : డీకే

‘ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ప్రపం చంలోనే అతి ముఖ్యమైన శక్తుల్లో ఒకటి.. అది రాష్ట్రపతి, న్యాయమూర్తి, నేను, మీరు ఎవరైనా ఇచ్చిన మాటను గౌరవించాలి’ అని అర్థం వచ్చేలా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ గురువారం ఉదయం ఎక్స్‌లో పోస్ట్ చేసి దానికి మాట నిలబెట్టుకోవడం అర్థం వచ్చేలా  ఓ పోస్టర్‌ను కూడా పంచుకున్నారు. అధికార మార్పుపై ఇచ్చిన ‘మాట’ నిలబెట్టుకో వాలనే అధిష్ఠానానికి డీకే సూచన చేసినట్లు అంతా భావిస్తున్నారు.

‘మాటే’ మాకు ప్రపంచం : సిద్ధు

‘కన్నడ ప్రజలు మాకిచ్చిన తీర్పు కేవలం ఒక క్షణం కోసం కాదు.. అది ఐదేళ్ల పూర్తి బాధ్యత. నాతో సహా కాంగ్రెస్ పార్టీ మా ప్రజ లకు ఇచ్చిన ‘మాట’ను చేతల్లో చేసి చూపిస్తు న్నాం. కన్నడ ప్రజలకు ‘మాట’ కేవలం ఒక నినాదం కాదు. అదే మాకు ప్రపంచం’ అని సిద్ధరామయ్య ఎక్స్‌లో పోస్టు పెట్టారు. మహి ళల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన ‘శక్తి’ పథ కం పురోగతిని వెల్లడిస్తూ ప్రజల ప్రపంచాన్ని ఉత్తమంగా మార్చనిదే ఆ ‘మాట’కు శక్తి ఉండ దు అంటూ మరో పోస్టు పెట్టారు. ఇవి అంత కుముందు డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

అందరితో చర్చించే నిర్ణయం : ఖర్గే

కర్ణాటకలోని అంతర్గత సమస్యను అందరి తో చర్చించాకే పరిష్కరిస్తామని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. అంద రితో చర్చించకుండా, ఏకపక్షంగా ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని ఆయన స్పష్టం చేశా రు. దీనిపై త్వరలో కీలక సమావేశం నిర్వహి స్తామన్నారు. దీనికి రాహుల్‌గాంధీ తోపాటు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కూడా హాజ రవుతారని తెలిపారు. పార్టీలో హైకమాండ్ పాత్రపై ఖర్గే మాట్లాడుతూ.. హైకమాండ్ అంటే ఒక వ్యక్తి కాదని, అదొక బృందమని పేర్కొన్నారు. హైకమాండ్ బృందం అంతా కలిసి కూర్చుని తుది నిర్ణయం తీసుకుంటుం దని స్పష్టం చేశారు.

డీకేకు సీఎం బాధ్యతలిస్తే మద్దతిస్తాం..

కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర 

కాంగ్రెస్ అధిష్ఠానం ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు ముఖ్యమంత్రి బాధ్యత లు అప్పగిస్తే మద్దతిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అంత్యంత సన్నిహి తుడు, ఆ రాష్ట్ర హోంమంత్రి జి. పరమేశ్వర ప్రకటించారు. కాంగ్రెస్ అధిష్ఠానం కర్ణాటక లో  నాయకత్వ మార్పునకు అంగీకరించిన క్రమంలో పరమేశ్వర మీడియాతో మాట్లాడుతూ పలు కీలకవ్యాఖ్యలు చేశారు.

ముఖ్య మంత్రి కావాలని తనకూ ఉందని మనసులోని మాటను బయటపెడుతూనే ఆ బాధ్యతను అధిష్ఠానం ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు అప్పగించినా అంగీకరించి మద్దతు ఇస్తామని తెలిపారు. పార్టీ కోసం తాను చేసిన కృషి అధిష్ఠానానికి తెలుసని, అంతిమ నిర్ణయం వారిదేనని అన్నా రు. ఈ క్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి తగిన వ్యక్తి అని వ్యాఖ్యానించారు. పదవి కోసం జరుగుతున్న కోల్డ్‌వార్‌కు తెరపడకముందే సీఎం సిద్ధరామయ్య శిబిరం నుంచి ఇలాంటి ప్రకటన రావడం చర్చనీయాంశమైంది.