calender_icon.png 24 October, 2025 | 3:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైట్‌హౌస్‌లో ‘బాల్‌రూం’ పనులు షురూ

22-10-2025 12:55:28 AM

అధికారికంగా ప్రకటించిన దేశాధ్యక్షుడు ట్రంప్

వాషింగ్టన్, అక్టోబర్ 21: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలల ప్రాజెక్టు బాల్‌రూం నిర్మాణ పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగానే వైట్‌హౌస్‌లో తూర్పువిభాగంలో కూల్చివేతలు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రవేశ ద్వారం, ఇతర కట్టడాలు నేలమట్టమయ్యాయి. 25 కోట్ల డాలర్ల వ్యయంతో పనులు కొనసాగనున్నాయి. ఈ విషయాన్ని ట్రంప్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

పనులు పూర్తయితే 90,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సమావేశ మందిరం అందుబాటులోకి వస్తుందని,  ఒకేసారి 999 మందితో దేశాధ్యక్షుడు సమావేశం నిర్వహించేందుకు వీలవుతుంది. ఇది ప్రస్తుతం అతిపెద్ద సమావేశ స్థలంగా ఉన్న ఈస్ట్ రూమ్ సామర్థ్యం కంటే మూడు రెట్లు ఎక్కువ. ఈ బాల్‌రూమ్ కల 150 ఏళ్ల నుంచి అమెరికా అధ్యక్షుల చిరకాల వాంఛ అని,  క్లాసిక్ హంగులు, అర్కిటెక్చర్‌తో నిర్మించనున్న పనులకు కొందరు దాతలు, కొన్ని కంపెనీ యాజమాన్యాలు నిధులు సమకూరుస్తున్నాయని, ట్రంప్ స్వయంగా కొంత సొమ్ము సమకూరుస్తున్నారని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి.