22-10-2025 12:55:48 AM
న్యూఢిల్లీ, అక్టోబర్ 21: హస్తినాపురంలో వాయు కాలుష్యం మరోసారి పంజా విసిరింది. దీపావళి పండుగ సందర్భంగా భారీగా పటాకులు కాల్చడంతో కాలుష్యం విపరీతంగా పెరిగింది. నగరమంతా పొగమంచు, ధూళి, కాలుష్యపు ముసుగును కప్పుకుంది. విజబిలిటీ కూడా భారీగా తగ్గింది. గాలినాణ్య త సూచిక(ఏక్యూఐ) సగటుగా 450 మధ్య నమోదైంది. దీంతో ఢిల్లీ రెడ్‌జోన్‌లోకి వెళ్లింది. గతేడాది దీపావళి తర్వాత రోజున 296 పాయింట్ల ఏక్యూఐ నమోదైంది. 38 మానిటరింగ్ కేంద్రాల్లో 36 రెడ్ జోన్‌లో ఉన్నాయి.
ఆనంద్ విహార్, పటేల్‌నగర్, జంహగీర్ పురి, బురారి వంటి ప్రాంతాల్లో ఏక్యూఐ 480 దాటింది. వాయు నాణ్యత తీవ్రంగా దిగజారడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముక్కు, కండ్లు, గొంతులో మంట, దురద వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మాస్క్ లేకుండా బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. గాలి నాణ్యత పడిపోవడంతో విజిబిలిటీ భారీగా తగ్గింది. దీంతో గ్రాప్ (గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్ష న్ పాన్ అమల్లోకి వచ్చింది. దీంతో ఢిల్లీలో నిర్మాణ పనులపై అధికారులు పరిమితులు విధించారు.
డీజిల్, జనరేటర్లు, కట్టెల పొయ్యి వినియోగంపై నిషేధం కొనసాగుతుంది. బస్సులు, మెట్రో రైళ్ల సేవలు పెంచడంతో పాటు పాఠశాలలకు ఆన్‌లైన్ క్లాసులు పరిశీలనలో ఉన్నాయి. రోడ్లపై నీటి స్ప్రేలు, యాంటీస్మాగ్ గన్స్ వినియోగిస్తున్నారు. జీహెచ్‌ఎంసీలో గాలి నాణ్యతా ప్రమాణాలు కూడా విపరీతంగా పడిపోయా యి. అలాగే పండుగ సందర్భంగా హైదరాబాద్‌లోనూ వాయు కాలుష్యం చోటుచేసు కుం ది. కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం అత్యధికంగా సనత్‌నగర్‌లో పీఎం 10 స్థాయి 153 మైక్రోగామ్ పర్ క్యూబిక్ మీటర్‌గా నమోదైంది. న్యూమలక్‌పేట 144, కాప్రా 140, కోకాపేట 134, సోమాజిగూడ 122, రామచంద్రాపురం 122, కొంపల్లిలో 120 మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్‌గా నమోదయ్యాయి.