calender_icon.png 25 October, 2025 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీహార్ ఎన్నికలకు జేఎంఎం దూరం

22-10-2025 12:53:11 AM

కాంగ్రెస్, ఆర్జేడీ కుట్ర కారణంగానే పోటీ నుంచి వైదొలిగామని ఆరోపణ

పాట్నా, అక్టోబర్ 21 : ఝార్ఖాండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అనూహ్య నిర్ణయం తీసుకుంది. బీహార్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వెల్లడించింది. ఒంటరిగా బరిలోకి దిగుతామని ప్రకటించిన మరుసటి రోజే కీలక ప్రకటన చర్చనీయాంశంగా మారింది. అయితే కాంగ్రెస్, ఆర్జేడీ కుట్ర కారణంగానే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ‘మహాఘట్ బంధన్’ కూటమిలో భాగంగా తమకు సీట్లు దక్కకుండా ఆ రెండు పార్టీలు కుట్ర పన్నాయని జేఎంఎం ఆరోపించింది.

ఈ నేపథ్యంలో ఝార్ఖండ్‌లో కాంగ్రెస్, ఆర్జేడీలతో ఉన్న పొత్తును పార్టీ సమీక్షిస్తుందని జేఎంఎం సీనియర్ నేత సుదివ్య కుమార్ తెలిపారు. ‘రాజకీయ కుట్రలో భాగంగా బీహార్ ఎన్నికల్లో జేఎంఎం పోటీ చేయకుండా కాంగ్రెస్, ఆర్జేడీ అడ్డుకున్నాయి.. ఆ పార్టీలే దీనికి బాధ్యత వహించాలి. వారికి మా పార్టీ సమాధానం ఇస్తుంది. ఆ పార్టీలతో ఉన్న పొత్తును సమీక్షిస్తుంది’. అని సుదివ్య కుమార్ పేర్కొన్నారు.