calender_icon.png 14 May, 2025 | 4:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరంతరం పనిచేయండి

08-05-2025 12:00:00 AM

  1. గడువులోగా పుష్కర పనులు పూర్తి చేయాలి 

దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావు 

మహాదేవపూర్ మే 7 (విజయ క్రాంతి): సరస్వతి పుష్కరాలను పురస్కరించుకొని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాలేశ్వరం లో చేపట్టిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడానికి కృషి చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్ వెంకటరావు ఆదేశించారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో సరస్వతి పుష్కర ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి దేవాదాయ శాఖ కమిషనర్ పరిశీలించారు.

విఐపి ఘాట్, గోదావరి ఘాట్, టెంట్ సిటీ, గోదావరి హారతి, స్నానగట్టాల ప్రాంతం, 100 గదుల సత్రం, హెలిప్యాడ్ ప్రాంతాలను సందర్శించారు. పనుల్లో జాప్యం తగదని, ప్రాధాన్యతను గమనిస్తూ నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేసి భక్తులకు ఎలాంటి సమస్య రాకుండా చూడాలని ఆదేశించారు. ప్రతి పనికి ఒక పర్యవేక్షణ అధికారిని నియమించి అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి అవసరమైతే మూడు షిఫ్టులు పనులు నిర్వహించాలని ఆదేశించారు.

సరస్వతీ పుష్కరాలకు భక్తులతో పాటు ముఖ్యులు, పీఠాధిపతులు వస్తున్నారని చెప్పారు. పలు పనులను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పనుల్లో జాప్యం కూడ దని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పు అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, విజయలక్ష్మి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, దేవాదాయ శాఖ ఆర్ జె సి రామకృష్ణారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.