05-12-2025 07:01:09 PM
నియోజకవర్గ ఇన్చార్జ్ వనమా వెంకటేశ్వరరావు
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం పరిధిలోని అన్ని పంచాయతీల్లో గ్రామపంచాయతీ ఎన్నికల బరిలో ఉన్న టిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకు ప్రతి కార్యకర్త సైనికుల పని చేయాలని నియోజకవర్గం ఇంచార్జ్ వనమా వెంకటేశ్వరరావు కోరారు. శుక్రవారం ఎన్నికల బరిలో ఉన్న టిఆర్ఎస్ అభ్యర్థులు తన నివాసంలో కలిసి ఆశ్చర్వాదం పొందారు.
ఈ సందర్భంగా ఆయన వారిను ఉద్దేశించి మాట్లాడుతూ... బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని, గత రెండేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులు గెల పొందుతే రాబోయే ఎన్నికల్లో అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్త సైనికుల పనిచేసే గెలుపు లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ మండల పట్టణ ముఖ్య నాయకులు పోటీ చేసే అభ్యర్థులు పాల్గొన్నారు.