calender_icon.png 25 July, 2025 | 9:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్క్ ఫ్రం హోం అంటూ అమాయకులకు బురిడీ..

23-06-2025 10:47:52 PM

రూ. కోట్లు విలువచేసే సైబర్ నేరం భగ్నం.. ఇద్దరు అరెస్టు...

వివరాలు వెల్లడించిన ఎస్పీ...

అదిలాబాద్ (విజయక్రాంతి): వర్క్ ఫ్రం హోం ఉద్యోగలంటూ అమాయకులను బురిడీ కొట్టిస్తూ లక్షల రూపాయలను దండుకుంటున్న సైబర్ నెరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రతిరోజు కోట్లలో సైబర్ నేరాలు చేస్తూ డబ్బులు దండుకుంటు, సైబర్ నేరాలకు పాల్పడుతూన్న నిందితులను పట్టుకోవడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం ఒక అడుగు ముందుకు వేసి ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి ఇద్దరు సైబర్ నేరగాళ్లను పట్టుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్(District SP Akhil Mahajan) తెలిపారు.

సోమవారం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ప్రధానంగా పట్టుకున్న A1 సౌరభ్ రాయక్వార్, A2 రితిక్ సేన్ ఇద్దరు నిందితులు మధ్యప్రదేశ్ లోని తికమ్‌గఢ్ జిల్లాకు సంబంధించిన నిందితులను కమిషన్ ఏజెంట్లుగా వాడుకుంటూ సైబర్ నేరాలకు పాల్పడుతూ ఉంటారని తెలిపారు. అమాయకులను వాట్సాప్ ద్వారా వర్క్ ఫ్రం హోం, తక్కువ డబ్బులతో తక్కువ సమయంలో ఎక్కువ లాభం సంపాదించవచ్చు అంటూ మోసం చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు.

ఈనెల 14న బాధితుడు ఫిర్యాదు చేసిన ఫిర్యాదు ఆధారంగా టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా బాధితుడు రూ 5,03,000/- పోగొట్టుకున్నట్లు 1930 కు ఫిర్యాదు చేయగా, రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి, ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి నిందితులను పట్టుకోవడంలో విజయవంత అయ్యమన్నారు. నిందితుల నుండి నాలుగు మొబైల్ ఫోన్ లు, ఒక లాప్ టాప్, బ్యాంకు పాస్ బుక్స్, కీబోర్డ్, మానిటర్, పాన్ కార్డులను స్వాదీనం చేసుకున్నట్లు వివరించారు.