15-10-2025 12:00:00 AM
బెల్లంపల్లి అర్బన్, అక్టోబర్ 14: దేశ ప్రగ తి కోసం బొగ్గు గనుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్న కార్మికులు శ్రమ దోపిడీతో పాటు వేతనాలు, ఉద్యోగ విరమణ అనంతరం బెనిఫిట్లలో కూడా యాజమాన్యాలు లూటీకి పాల్పడుతున్నాయని ఆరోపణనులు వెల్లువెత్తుతున్నాయి. తమ జీవిత కాలంలో కష్టార్జితంగా వచ్చే గ్రాట్యూటీలో నిబంధనల పేరిట కోత పెడుతున్నారని పలువురు కార్మికులు ఆరోపిస్తున్నారు.
గ్రాట్యూటీ చెల్లింపులు ఇట్లా...
బొగ్గు గని కార్మికులు 30 సంవత్సరాలు పని చెస్తే.. సంవత్సరానికి 15 రోజుల వేతనం చెల్లిస్తారు. 30 సంవత్సరాల కన్నా ఎక్కువ సర్వీస్ చెస్తే ఆ ఎక్కువ చేసిన సంవత్సరాలకు సంవత్సరానికి నెల వేతనం చెల్లిస్తారు. ఇట్ల లెక్కగట్టగా వచ్చిన మొత్తం రూ. 20 లక్షలకు సీలింగ్ విధించారు. అంటే ఆ మొత్తం రూ. 20 లక్షలు దాటినా రూ. 20 లక్షలు మాత్ర మే ఇస్తారు. ఈ సీలింగ్ వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు.
విద్రోహపూరిత ఈ ఒప్పందానికి జాతీయ సంఘాలు ఎలా ఒప్పుకున్నాయని కార్మికులు మండిపడుతున్నారు. వేతన సీలింగ్‌పై జాతీయ సంఘాలు, కోల్ ఇండియా మేనేజ్మెంట్‌తో ఒప్పందం చేసుకునీ ఏమి ఎరగనట్లు వ్యవహరించడంపై రిటైర్డ్ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదు జాతీయ సంఘాల అంగీకారంతోనే జరిగిన సీలింగ్ వల్ల తమ జీవి తాలకు తీరని నష్టం జరిగిందనీ వాపోతున్నారు.
మొదట్లో గ్రాట్యూటీ సీలింగ్ స్కీమ్ రూ. 10 లక్షలు ఉండేది. 11 వ భారత బొగ్గు గని కార్మికుల వేజ్ బోర్డు ఒప్పందం (2016)లో ఈ సీలింగ్ ను రూ. 20 లక్షలకు పెంచారు. కానీ అమలు మాత్రం 2018 జూన్ నుంచి చేస్తున్నారు. అధికారులకు మాత్రం 2017 నుంచి అమలు చేశారు. ఈ మధ్య కాలం లో రిటైర్డ్ అయిన కార్మికులకు నష్టం జరిగింది. ఈ ఒప్పందం వల్ల కోల్ ఇండియా, సింగరేణి కార్మికులు, ఉద్యోగులు అధికారు లకు తీరని నష్టం జరుగుతూనే ఉంది.
ఎందుకంటే చాలా మంది కార్మికులకు గ్రాట్యూటీ లెక్కింపు వేస్తె సీలింగ్ దాటిపోతోంది. ఒక్కొక్క కార్మికునికి రూ. 40 లక్షల వరకు వస్తోంది. అంటే సుమారు రూ. 20 లక్షల వరకు కార్మికుడు నష్టపోతున్నాడు. సీలింగ్ ఎత్తి వేయాలనే డిమాండ్ కార్మికుల్లో బలంగా వినిపిస్తోంది. కానీ ఈ బలమైన డిమాండ్‌ను జాతీయ సంఘాలు కేంద్ర ప్రభుత్వం ముందు, యజమాన్యాల ముం దు వినిపించలేకపోతున్నాయి.
రిటైర్ అయ్యే కార్మికుల్లో 80 శాతం ఈ సీలింగ్‌కు బలి అయ్యి డబ్బు కోల్పోతున్నారు. కార్మికుల శ్రమతో వచ్చిన ఆదాయాన్ని కూడా కొల్లగొట్టే విధంగా ఉండకూడదనీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఓ వైపు ఒప్పందా ల్లో కోలిండియా యాజమాన్యం వేతనాలు పెంచుతున్నట్టుపైకి కనిపిస్తూనే మరోవైపు ఆ ఒప్పందాలను తుత్తునీయలు చేసేందుకు కొర్రీలు పెట్టడం కోల్ ఇండియా యజమా న్యం, కేంద్ర పాలకులకు ఆనవాయితిగా వస్తున్న అలవాటే అన్న విమర్శలు సింగరేణిలో భగ్గుమం టున్నాయి.
ఇలాంటి ఒప్పందాలను కుదుర్చుకోవడం జాతీయ సంఘా లకు కూడా వెన్నతో పెట్టిన విద్యగానే కనిపిస్తోంది. ప్రభుత్వ మోడీ కనుసన్నల్లో 2018 సంవత్సరం నుంచీ అమల్లోకి వచ్చిన సీలిం గ్ విధానం కార్మికులకు వేతనాలు పెరుగుదలకి గొడ్డలి పెట్టుగామారింది. బేసిక్‌పై వేజ్‌బోర్డులో పెరిగిన వేతనాల ఆధారంగా ప్రతి కార్మికునికి, ఉద్యోగికి గ్రాడ్యూటీలో ఆయా కార్మికులకి నిధులు పోగుబడుతా యి. రిటైర్మెంట్‌తో గ్రాడ్యూటీ కార్మికులకు చెల్లిస్తారు.
దిగిపోయినా కార్మికుల భవిష్యత్తుకీ గ్రాడ్యూటీ డబ్బులే జీవనాధారంగా పనికొస్తాయి. కోల్ ఇండియా యజమా న్యం, జాతీయ సంఘాలు కలిసి సీలింగ్ పేరి ట కార్మికుల మూల ఆదాయం వనరులను లూటీ చేశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీలింగ్ వల్లకార్మికులు, అధికారు లు రూ. 15 నుంచి రూ. 40 లక్షలలోపు చేతికందకుండా పోతున్నది. సీలింగ్ పరిధి దాటి నా ఒక్క పైసా కూడా కార్మికులకు ఇవ్వరు. సీలింగ్‌తో రూ. ఇట్లా లక్షల గ్రాట్యూ టీ నిధులను కార్మికులు, ఉద్యోగులు రిటైర్మెంట్‌తో కోల్పోతున్నారు. ఇది వారి పాలిట శాపంగా మారింది.
ద్రోహం చేసి.. మౌనంగా..
సీలింగ్‌పై ఒప్పందం చేసుకొని జాతీయ సంఘాలు తమకేమి తెలియనట్టుగా ఉండిపోతున్నాయి. గ్రాడ్యూటీ సీలింగ్‌ను కార్మికు లు ఎత్తివేయాలన్న డిమాండ్ జాతీయ సంఘాల చెవికెక్కడం లేదు. వారి అంగీకారంతోనే సీలింగ్ అమల్లోకి వచ్చేసింది కనుక, నోట్లో వెలక్కాయ పడినట్లుయ్యింది. దిగిపోయే ప్రతి కార్మికుడు సీలింగ్ వరంగా జరిగే నష్టాన్ని తలుచుకొని కన్నీటి పర్యంతమవుతున్నారు. సీలింగ్ పాపం తిలాపిడికెడు తలా ఇంత చందంగా కోల్ ఇండియాకి, జాతీయ సంఘాలకి అంటుకుంటదని అం టున్నారు. ఈ విషయంలో కార్మికులకు జరిగిన ద్రోహంపై జాతీయ సంఘాల లీడర్లు పల్లెత్తు మాట అనడం లేదు. ఈ సంఘాల ఒప్పందాల తీరంతా విద్రోహాలే అని కార్మికులే తిట్టుకొని సరిపెట్టుకుంటున్నారు.
జాతీయ సంఘాల తీరు ఇలా ఉంటే.. ప్రజాప్రతినిధులు కూడా వారికి ఏమాత్రం తీసుకోకుండా సీలింగ్‌పై మౌనం వహిస్తున్నారు. దీంతో ఇద్దరూ దొందు దొందే అని కార్మికలోకం తీవ్రoగా మండిపడుతున్నది. ఏదేమైనా గ్రాడ్యూటీ రూ. 20 లక్షల సీలింగ్ పై పునరాలోచన అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు కోల్ ఇండియా యజమాన్యం చేయాలన్న డిమాండ్‌లో న్యాయం ఉందని నిపుణు లు అంటున్నారు. సీలింగ్ ఎత్తివేతపై ఒత్తిడి రోజురోజుకీ పెరుగుతోందన్నదీ వాస్తవం.
సీలింగ్‌తో ఎవరికి లాభం..?
గ్రాట్యూటీపై సీలింగ్ విధానం కోల్ ఇండియా కంపెనీ ప్రభుత్వానికి లాభం. కాగా దిగిపోయే కార్మికులకు అది ఆశనిపాతంగా మారింది. భవిష్యత్తు కార్మికులు, ఉద్యోగులకు సైతం ఎనలేని నష్టం చేయనుం ది. ఇలాంటి ఒప్పందాన్ని జాతీయ సంఘాలు ఎవ రి ప్రయోజనం కోసం ఒప్పుకున్నా యో అర్థం కావడం లేదు. ఈ ఒప్పం దం వేతన పెరుగుదలను మరో రూపంలో కుదించి కార్మికులకి ఆర్థిక పరంగా నష్టంచేస్తున్నది.
సీలింగ్ వల్ల కోల్ ఇండియా కంపెనీ, కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే లాభదాయకమని అంటున్నారు. సీలింగ్‌వేతనాల పెరుగుదలకి ప్రధాన అడ్డంకిగా తయారైందనీ మండిపడుతున్నారు. వేతన పెరుగుదల కు నోచుకోకుండా గొర్రెతోక బెత్తడు చందంగా వేతనాలు ఉండిపోతాయి.
ధరల పెరుగుదలకు అనుగుణంగా పెరిగే కార్మికుల జీతభత్యాల ఆధారం గా పోగుబడే గ్రాడ్యూటీ కార్మికులు, ఉద్యోగులకు శేష జీవితంలో వారి కుటుంబాలను ఎంతగానో ఆదుకుంట ది. 2018 నుంచి దిగిపోతున్న వందలాది సింగరేణి కార్మికులు, ఉద్యోగు లు, అధికారులు సీలింగ్ వల్ల భారీగా నష్టపోతున్నారు.