calender_icon.png 15 October, 2025 | 10:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిబ్రవరిలోనే ఇంటర్ పరీక్షలు ?

15-10-2025 12:00:00 AM

-ప్రాక్టికల్ పరీక్షలు కూడా ముందుగానే..

-అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ఇంటర్ బోర్డు ప్రతిపాదనలు

-జేఈఈ, నీట్‌కు విద్యార్థులు సన్నద్ధమయ్యేందుకే షెడ్యూల్‌లో మార్పులు

-పరీక్ష ఫీజు పెంపు యోచనలో సర్కార్

హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): ఇంటర్ వార్షిక పరీక్షలు ఫిబ్రవరి చివరి వారంలో  ప్రారంభించాలని బోర్డు భావవిస్తున్నట్లు తెలిసిం ది. ఈ మేరకు ప్రభుత్వానికి బోర్డు అధికారులు ప్రతిపాదనలు పంపించినట్లు తెలిసింది.  ఇంటర్ పరీక్షల తర్వాత జేఈఈ, నీట్ వంటి  పోటీ పరీక్షలకు విద్యార్థులకు తగిన సమయం ఇచ్చేలా షెడ్యూల్‌ను మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. గత విద్యాసంవత్సరం మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షలు నిర్వహించారు.

ఏప్రిల్ 2వ తేదీ నుంచి జేఈఈ తుది విడత మొదలైంది. దీంతో విద్యార్థులకు సన్నద్ధమయ్యేందుకు పెద్దగా సమయం దొరకకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. దీన్ని అధిగమించేందుకు గానూ ఈసారి కాస్త ముందు గా నిర్వహించాలని బోర్డు అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. మరీ ఇలా అయితే ప్రాక్టికల్ పరీక్షలను కూడా కాస్త ముందే జరపాల్సి ఉంటు ంది. ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఇదిలా ఉంటే పరీక్ష ఫీజు పెంపు యోచనలో కూడా బోర్డు ఉన్నట్లు తెలిసింది. ఈ విద్యాసంవత్సరం 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.