calender_icon.png 26 May, 2025 | 12:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుజరాత్ ఓటమి.. ఆఖరి మ్యాచ్‌లో సత్తాచాటిన చెన్నై

25-05-2025 07:22:19 PM

అహ్మదాబాద్: ఐపీఎల్(IPL-2025)లో భాగంగా నరేంద్ర మోదీ స్టేడియం(Narendra Modi Stadium) వేదికగా జరిగిన మ్యాచులో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)పై చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) 83 పరుగుల తేడాతో భారీ గెలుపును సోంతం చేసుకుంది. 231 పరుగుల లక్ష్యంతో వచ్చిన గుజరాత్.. 18.3 ఓవర్లకు 147 పరుగులకే ఆలౌటైంది. గుజరాత్ బ్యాటర్లలో సాయి సుదర్శన్(41), గిల్(13), షారుఖ్ ఖాన్(19), తివాటియా(14), అర్షద్ ఖాన్(20) పరుగులతో నిరాశపరిచారు. చెన్నై బౌలర్లలో అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్ తలో 3 వికెట్లతో అదరగొట్టారు. 

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు కొల్పోయి 230 పరుగులు చేసింది. చెన్నై బ్యాటర్లలో ఆయుష్ మాత్రే(34), డివోన్ కాన్వే(52), ఉర్విల్ పటేల్(37), డివాల్డ్ బ్రేవిస్(57), జడేజ(21) పరుగులతో రాణించారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ కృష్ణ 2 వికెట్లు తీసుకోగా.. సాయి కిశోర్, రషీద్ ఖాన్, షారుఖ్ ఖాన్ చెరు వికెట్ తీశారు. కాగా, లీగ్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ కి ఇదే చివరి మ్యాచ్.