calender_icon.png 26 October, 2025 | 4:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరల్డ్ మెంటల్ హెల్త్ డే ర్యాలీ

25-10-2025 01:03:37 AM

ఘట్ కేసర్, అక్టోబర్ 24 (విజయక్రాంతి) : వరల్ మెంటల్ హెల్త్ డే పురస్కరించుకొని కమ్యూనిటీలో మానసిక ఆరోగ్య ప్రాముఖ్యతపై అవగాహన పెంచడం లక్ష్యంగా అనురాగ్ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ సెల్ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ గ్రామంలో శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈకార్యక్రమం మానసిక స్థితిగతి గురించి అవగాహన పెంపుతోపాటు మనసిక దృఢత్వాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో నిర్వహించబడిందని తెలిపారు.

ఈకార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  విద్యార్థుల కోసం మానసిక ఆరోగ్య పరిరక్షణ దాని ప్రాముఖ్యతపై ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు. అనురాగ్ యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ ఎం. శ్రీనివాస్ రావు, సైకాలజిస్టు రక్షిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో తమ అనుభవాలు పంచుకున్నారు.

ఈకార్యక్రమాన్ని ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ డాక్టర్ సి. మల్లేశ, ఎన్సిసి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ టి. పురుషోత్తమ్ సమన్వయ పరచగా అనురాగ్ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్, ఎన్సిసి అధ్యాపకులు, విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు.