calender_icon.png 15 December, 2025 | 7:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరి కొయ్యలను కాల్చడం సరికాదు

10-12-2025 12:00:00 AM

జిల్లా వ్యవసాయ అధికారి స్వరూప రాణి 

కొండపాక, డిసెంబర్ 9: కొండపాక మండలం వెలికట్ట గ్రామంలోని వరి కొయ్యలను కాల్చకూడదని సిద్దిపేట జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపారాణి పేర్కొన్నారు. కొండపాక మండలం వెలికట్ట గ్రామంలో మంగ ళవారం మధుసూదన్ వరి పొలంలో వరి కొయ్యలను కాల్చడం వల్ల నష్టం తప్ప లా భం ఏమీ లేదని సిద్దిపేట జిల్లా వ్యవసాయ అధికారిని స్వరూపారాణి అన్నారు. ఈ సందర్భంగా స్వరూపారాణి మాట్లాడుతూ వరి కొయ్యలను కాల్చితే అధిక వేడి, నత్రజని, ఫాస్పరస్ లాంటి పోషక పదార్థాల శాతం తగ్గుతుందన్నారు.

పంటలకు అవసరమైన ఖనిజలవణాలు దెబ్బతింటాయని, పొలాల్లో తిరిగే ఉడుములు, తొండలు అనేక జీవరాశులు చనిపోయే ప్రమాదం ఉందన్నారు. సమతుల్యత దెబ్బతింటుందని, వరి కొయ్యలను నేలలో కలియ దుంన్నడం వల్ల సేంద్రీయ కర్బన శాతం పెరిగి ఐదు నుంచి పది శాతం వరకు అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. సూపర్ ఫాస్పేట్ లేదా వేస్ట్ డీకంపోజర్ చల్లితే వరి కొయ్యల అవశేషాలు రెండు వారాలలో మురికి పోషకాలుగా తయారైతాయన్నారు. సూపర్ ఫాస్ట్ చల్లడం వలన భూమి చౌడుబారక్కుండా సేంద్రీయ పదార్థాల స్థాయిని పెంచుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ రమ్యశ్రీ, రైతులు తదితరులుపాల్గొన్నారు.