calender_icon.png 5 August, 2025 | 2:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కట్టంగూర్ ఇంచార్జ్ తహసీల్దార్‌గా పి.యాదగిరి బాధ్యతలు స్వీకరణ

04-08-2025 11:07:16 PM

నకిరేకల్ (విజయక్రాంతి): కట్టంగూరు మండల(Kattangoor Mandal) ఇంచార్జి తహసీల్దార్‌గా పి.యాదగిరి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఇన్‌చార్జి తహసీల్దార్‌గా పని చేస్తున్న ఎల్.వెంకటేశ్వర్‌రావు స్థానంలో నకిరేకల్ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న పి.యాదగిరికి (పూర్తి అదనపు బాధ్యతలు) అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రైతులు మధ్యవర్తులను సంప్రదించకుండా నేరుగా దరఖాస్తులు చేసుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. డీటీ ప్రాంక్లిన్ ఆల్భట్, ఆర్ఐ కుమార్‌రెడ్డి, కార్యాలయం సిబ్బంది తహసీల్దార్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.