04-08-2025 11:09:31 PM
ఘట్ కేసర్: పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి అన్నోజిగూడలో అయ్యప్ప స్వామి ఆలయం సమీపంలో సుమారు 5 సంవత్సరాల వయస్సు గల బాలుడు తప్పిపోయి కనిపించాడు. తన కుటుంబం గురించి అడుగుతే స్పష్టమైన వివరాలను చెప్పలేకపోతున్నాడు. కానీ తాను సూరారం గ్రామానికి చెందినవాడినని చెబుతున్నాడు. ఆ బాలుడు ప్రస్తుతం పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్‌లో ఉన్నాడు. ఎవరైనా అతన్ని గుర్తించగలిగితే దయచేసి పోచారం ఐటీసీ పోలీస్ స్టేషన్ 8712662718 నంబర్ ను సంప్రదించాలని పోచారం సర్కిల్ ఇన్ స్పెక్టర్ రాజు వర్మ(Circle Inspector Raju Varma) కోరారు.