08-05-2025 12:00:00 AM
తెలంగాణ యాదవ విద్యావంతుల వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు చలకాని వెంకట్ యాదవ్
భద్రాచలం, మే 7(విజయక్రాంతి): భద్రాచలం పట్టణంలోని రామాలయం రోడ్డులో శ్రీకృష్ణ మందిరంలో బుధవారం జరిగిన యాదవ సంఘం రాజకీయ అవగాహన తరగతుల్లో తెలంగాణ యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు చలకాని వెంకట్ యాదవ్ పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ యాదవులు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలని, అన్ని రంగాలలో యాదవులు ముందు ఉండాలన్నారు, నిరుపేద యాదవ విద్యార్థుల చదువు కోసం కూడా సంఘం ఆధ్వర్యంలో ఆర్థికంగా సహాయం చేయాలన్నారు , ఓట్లు మావి సీట్లు మావే నినాదంతో మన జనాభా ప్రకారం మనకు వాటా వచ్చేలా డిమాండ్ చేయాలన్నారు, విద్యావంతల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగ సీతారాములు యాదవ్ మాట్లాడుతూ యాదవ్ జాతి మొత్తం కూడా ఐక్యంగా ఉండాలని సమాజంలో మంచి గుర్తింపు పొందాలని, యాదవుల కోసం తాను కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం పట్టణ అధ్యక్షులు జెట్టి రామకృష్ణ యాదవ్, గోసుల శ్రీనివాస్ యాదవ్, నక్క సాయిరాం యాదవ్, కుమ్మరి కుంట సాంబశివరావు యాదవ్ శ్రీరామ్ యాదవ్, మేకల మళ్లీ బాబు యాదవ్ తో పాటు భద్రాచలం పట్టణం మరియు చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున యాదవ మిత్రులు పాల్గొన్నారు.