calender_icon.png 10 May, 2025 | 10:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆపరేషన్ సిందూర్‌కు అభినందనల వెల్లువ

08-05-2025 12:00:00 AM

జాతీయ పతాకంతో సీపీఐ సంఘీభావం , సెల్‌ఫోన్ స్టేటస్‌లో ఆపరేషన్ సింధూర్

మహబూబాబాద్, మే 7 (విజయ క్రాంతి): ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశం పిఓకే లో ఉన్న ఉగ్ర స్థావరాలపై దాడులు నిర్వహించడాన్ని సర్వత్రా హర్షిస్తున్నారు. ఎవరి సెల్ ఫోన్ స్టేటస్ చూసినా ఆపరేషన్ సింధూర్ కు మద్దతు పలికే విధంగా పెట్టుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి హర్షం వ్యక్తం చేశారు. అలాగే సీపీఐ ఆధ్వర్యంలో భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శించి మద్దతు పలికారు.

భారత సైన్యానికి రెడ్ శాల్యూట్, పెహల్గాం అమరవీరులకు లాల్ సలాం, దేశ సమగ్రత, సమైక్యత ప్రధానం, జై జవాన్ జై భారత్ అంటూ నినాదాలు చేసి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి విజయసారథి మాట్లాడుతూ పాకిస్తాన్తో భారత్ యుద్ధం చేయడం లేదని, ఉగ్రవాదం పైనే యుద్ధం చేస్తోందని చెప్పారు.

పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం వల్ల ఈ దుస్థితి వచ్చిందని, దేశ ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలని, ఉగ్రవాద నిర్మూలనకు 140 కోట్ల మంది భారతీయులు కలిసికట్టుగా పోరాడేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ అజయ్ సారథి రెడ్డి, పెరుగు కుమార్, చింతకుంట్ల వెంకన్న, పాండురంగ చారి, వరిపల్లి వెంకన్న, వెలుగు శ్రావణ్, అశోక్, చిరంజీవి, సతీష్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.