calender_icon.png 16 September, 2025 | 9:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయోర్టిక్ ఆర్చ్ రీపెయిర్ చేసి ప్రాణాలు కాపాడిన యశోద వైద్యులు

16-09-2025 06:59:31 PM

కరీంనగర్ క్రైమ్,(విజయక్రాంతి): హైదరాబాద్, జూన్ 13, 2025: హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్స్, కరీంనగర్కు చెందిన 64 ఏళ్ల పేషేంట్ శ్రీ నాగయ్య నేరెల్లాకు ఆర్చ్ డీబ్రాంచింగ్ మరియు ఆర్చ్ వెసెల్ రీప్లేస్మెంట్ తో అత్యంత సంక్లిష్టమైన టోటల్ అయోర్టిక్ ఆర్చ్ రీపెయిర్ను విజయవంతంగా నిర్వహించింది. రక్తపోటుతో బాధపడుతున్న నాగయ్యకు నిరంతరంగా దగ్గు రావడం, గొంతు బొంగురుపోవడం మరియు ఛాతీ నొప్పి లక్షణాలు కూడా  వైద్య పరీక్షలలో అయోర్టిక్ ఆర్చ్ దగ్గర పెద్ద సాక్యులర్ అనూరిజం ఉందని తేలింది. ఇది అత్యవసర శస్త్రచికిత్స అవసరమయ్యే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి.

సీనియర్ కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ విక్రమ్ రెడ్డి ఐరా మరియు అసోసియేట్ కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జరీ డాక్టర్ శివ శంకర రెడ్డి తలపరెడ్డి నేతృత్వంలోని సర్జికల్ బృందం జూన్ 7, 2025న జనరల్ అనస్థీషియా కింద క్లిష్టమైన అయోర్టిక్ ఆర్చ్ రిపైర్  శాస్త్ర చికిత్స  తర్వాత, నాగయ్య ఎటువంటి పెద్ద సమస్యలు లేకుండా సజావుగా కోలుకున్నారు. మరియు జూన్ 12, 2025న స్థిరమైన స్థితిలో డిశ్చార్జ్ చేసి ఈ విజయవంతమైన సర్జరీ, అత్యాధునిక సాంకేతికత మరియు మల్టీడిసిప్లినరీ బృందంతో అత్యంత సంక్లిష్టమైన కార్డియోథొరాసిక్ శస్త్రచికిత్సలను నిర్వహించడంలో యశోద హాస్పిటల్స్ నైపుణ్యాన్ని మరోసారి హైలైట్ చేస్తుంది.