26-10-2025 05:06:55 PM
నిర్మల్ (విజయక్రాంతి): సారంగాపూర్ మండలం చించోలి గ్రామంలో మహాలక్ష్మి అమ్మవారి విగ్రహా ప్రతిష్టాపన కార్యక్రమంలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విడిసి సభ్యులు ఎమ్మెల్యేని శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నరేష్, నాయకులు తక్కల రమణ రెడ్డి, రాంశంకర్ రెడ్డి, గంగారెడ్డి, సాహెబ్ రావ్, గంగాధర్, వెంకటేష్, జమాల్, మైస శేఖర్, కార్తీక్, ముత్యం, లక్ష్మణ్, గంగాధర్, లింగారెడ్డి, విడిసి సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.