calender_icon.png 26 October, 2025 | 8:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు నిరంతర విద్యుత్‌ సరఫరా అందించడమే అధికారుల బాధ్యత

26-10-2025 05:11:18 PM

ముత్తారం ట్రాన్స్ కో ఏఈ దూర్షెట్టి రాజేందర్‌ బాధ్యత స్వీకరణలో మంథని ఏడీ కనుకయ్య..

ముత్తారం (విజయక్రాంతి): ప్రజలకు నిరంతర విద్యుత్‌ సరఫరా అందించడమే అధికారుల బాధ్యత అని మంథని ట్రాన్స్ కో ఏడి కనకయ్య అన్నారు. ముత్తారం ఏఈగా దూర్షెట్టి రాజేందర్‌ శనివారం బాధ్యతలు స్వీకరించారు. నిర్మల్‌ జిల్లా నుండి బదిలీపై ముత్తారంకు రాగా, ఆదివారం మంథని ఏడీ ఆధ్వర్యంలో రాజేందర్‌ను స్వాగతం పలుకుతూ సన్మానం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఏడీ కనుకయ్య మాట్లాడుతూ “విద్యుత్‌ శాఖ ప్రజలకు అత్యవసర సేవలు అందించే ముఖ్య విభాగమని, కొత్తగా బాధ్యతలు చేపట్టిన రాజేందర్‌ ప్రజలకు నిరంతర విద్యుత్‌ సరఫరా, సాంకేతిక సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏఈ రాజేందర్‌ మాట్లాడుతూ ముత్తారం మండల ప్రజలకు సమయానుసారంగా, అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా కొనసాగించేందుకు తాను కృషి చేస్తానని తెలిపారు. విద్యుత్‌ వినియోగదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం తన ప్రాధాన్యతగా తీసుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్‌ శాఖ సిబ్బంది, సాంకేతిక సిబ్బంది పాల్గొన్నారు.