calender_icon.png 26 October, 2025 | 8:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జహీరాబాద్ మెడికల్ విద్యార్థులతో సమావేశం

26-10-2025 05:12:24 PM

హైదరాబాద్: జహీరాబాద్ లోని (TMREIS) తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలో చదివి ఎంబీబీఎస్ లో సీట్ పొందిన విద్యార్థులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం సన్మానించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు, బీఆర్ఎస్ నాయకులు, తదితులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంబీబీఎస్ సీట్ సాధించిన మైనార్టీ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కేటీఆర్, హరీష్ రావు శాలువతో సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురుకుల పాఠశాలలు పెట్టి మైనార్టీలకు నాణ్యమైన విద్యను అందించారని గుర్తు చేశారు.

 తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యాసంస్థల వల్ల మైనార్టీలకు ఎంత లాభం జరిగిందనేది మీకే బాగా తెలుసని, మైనార్టీ వెల్ఫేర్ స్కూల్లో చదివి తల్లిదండ్రులకు, కేసీఆర్ కలను నిజం చేసిన మిమ్మల్ని సన్మానించుకోవడం సంతోషంగా ఉందన్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 203 మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేసింది కేసీఆర్, ఆటో డ్రైవర్ ఇబ్రహీం కుమారుడు ఒబేదు ఎంబీబీబఎస్ సీట్ సాధించడం గొప్ప విషయం అని హరీష్ రావు ప్రశంసించారు.  బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిండు. కానీ ఇప్పడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు ఏండ్లలో సీఎం రేవంత్ రెడ్డి లక్ష ఇండ్లను కూలగొట్టిండని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పేదల ఇండ్లు కూల్చొద్దంటే, హైడ్రా బందు కావాలంటే, జూబ్లీ హిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలన్నారు. మల్లా కేసీఆర్ వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని హరీశ్ రావు హితవు పలికారు. భర్తను కోల్పోయిన బాధలో మాగంటి సునీతమ్మ ఏడిస్తే కూడా ఆడపడుచు అని చూడకుండా, కనీసం మానవత్వం లేకుండా కాంగ్రెస్ నాయకులు అవహేళన చేసిండ్రాని ఆయన మండిపడ్డారు. అందుకే సునీతమ్మకు మీరు అండగా నిలవాలిచి, ఈ కాంగ్రెస్ దుర్మార్గులకు ఓటుతో గుణపాఠం చెప్పాలని కోరారు. కారు గుర్తు మీద ఓటు గుద్దితే ముఖ్యమంత్రి అదిరిపడ్డాలన్నారు.