calender_icon.png 28 July, 2025 | 2:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన సీఆర్టీ పరీక్షలు

27-07-2025 11:59:59 PM

కుమ్రం భీం అసిఫాబాద్, జూలై 27(విజయక్రాంతి): సి.ఆర్.టి.- ఎస్. జి. టి. పరీక్ష ప్రశాంత వాతావరణంలో జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని టి.జి. టి.డబ్ల్యూ. యు.ఆర్.జె.సి. (పి.టి.జి.- బాలుర), ఆశ్రమ పాఠశాల (బాలికలు)- ఆసిఫాబాద్ (స్పోరట్స్ స్కూల్) లలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిర్వహించిన సి.ఆర్.టి.- ఎస్.జి.టి. పరీక్ష ప్రశాం తంగా జరిగిందని తెలిపారు. పరీక్షకు హాజర య్యే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించడం జరిగిందని, అత్యవసర సేవలు నిమిత్తం వైద్య సిబ్బందిని నియమించి అవసరమైన మందులు అందుబాటులో ఉంచడంతో పా టు పారిశుధ్యం, త్రాగునీరు, నిరంతర విద్యు త్ సరఫరా ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

నిబంధనల ప్రకారం అభ్యర్థులను తనిఖీ చేసి పరీక్ష కేం ద్రంలోనికి అనుమతించడం జరిగిందని, ప్రశాంత వాతావరణంలో పరీక్ష కొనసాగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధి త అధికారులు తదితరులు పాల్గొన్నారు.