calender_icon.png 21 September, 2025 | 4:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువ కళాకారులు ప్రతిభ చాటాలి

21-09-2025 12:34:15 AM

  1. ‘బతుకమ్మ యంగ్ ఫిల్మ్‌మేకర్స్ చాలెంజ్’ పోటీలను వినియోగించుకోవాలి
  2. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 
  3. ఆడబిడ్డలకు మంత్రి ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి) : యువ కళాకారులు అవకాశాలను సద్వినియోకం చేసుకుని తమ ప్రతిభను ప్ర పంచానికి చాటిచెప్పాలని  సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సూచించారు. తెలంగాణ రాష్ర్ట సినిమాటోగ్రఫీ శాఖ ఆధ్వర్యంలో ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా నిర్వహిస్తున్న ‘బతుకమ్మ యంగ్ ఫిల్మ్‌మేకర్స్ ఛాలెంజ్‌” బ్రోచర్, పోస్టర్‌ను మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి శనివారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణ చరిత్ర, సంస్కృ తి, కళా రూపాలు, ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సం క్షేమ పథకాలపై వీడియోలను రూపొందించి, యువ కళాకారులు తమలోని సృజనాత్మకతను చాటే ఈ మహత్తర అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజును మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ప్రజా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథ కాలు ప్రజల్లోకి వెళ్లేందుకు, యువ కళాకారుల ప్రతిభ వెలుగులోకి తెచ్చేందుకు ఈ పోటీ సరైన వేదిక కానుందని మంత్రి పేర్కొన్నారు. 

పోటీల వివరాలు...

ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధ్ది, సంక్షేమం (మహిళలకు ఉచిత బస్సు, మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ తదితరాలు), తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పండుగలు, కళారూపాలపై షార్ట్ ఫిలిమ్స్, పాటల పోటీలు ఉంటాయి. షార్ట్ ఫిలిమ్స్ నిడివి 3 నిమిషాలకు, పాటల వ్యవధి 5 నిమిషాలకు మించి ఉండకూడదు.  

పోటీల్లో ఎంపికైన థీమ్స్‌కు... 

* ప్రథమ బహుమతి - రూ.3 లక్షలు

* ద్వితీయ బహుమతి - రూ.2 లక్షలు

* తృతీయ బహుమతి - రూ.లక్ష

* కన్సోలేషన్ బహుమతి -రూ. 20 వేలు (అయిదుగురికి) ఇవ్వడంతో పాటు విజేతలందరికీ ప్రశంసాపత్రం, జ్ఞాపిక ప్రదా నం చేస్తారు. నిర్దేశిత గడువులోగా  వచ్చిన ఎంట్రీలను నిపుణులతో కూడిన జ్యూరీ వీక్షించి వివిధ కేటగిరీలలో ఎంపికలు పూర్తి చేస్తుంది. ఎంట్రీలను ఈ కింది మెయిల్ ఐడీ youngfilmma kerschallenge@gmail.com లేదా వాట్సాప్ నంబర్ 8125834009 కు పంపాలి. ఎంట్రీలను పంపించేందుకు తుది గడువు సెప్టెంబరు 30, 2025గా నిర్ణయించారు. 

సాంస్కృతిక వారసత్వ ప్రతీక బతుకమ్మ 

తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సంద ర్భంగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజే శారు. ప్రజల జీవితాల్లో బతుకమ్మ వెలుగులు నింపాలని మంత్రి ఆకాంక్షించారు. 

పోటీలకు సంబంధించిన అర్హతలు 

* ఈ పోటీలో పాల్గొనే వారందరూ 40 ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలి. 

* 4కే రెజల్యూషన్ కలిగి ఉండాలి. 

* షార్ట్ ఫిల్మ్స్/ వీడియో సాంగ్స్ ఏవైనా ఈ పోటీల్లో సూచించిన ‘థీమ్’ల పైనే ఉండాలి.

* మీరు చేసిన వీడియోలు గతంలో ఎక్కడా ప్రదర్శించి ఉండకూడదు. 

* బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ చాలెంజ్ కోసమే చిత్రీకరించినవి మాత్రమే ఉండాలి