21-09-2025 12:33:37 AM
-కార్పొరేటర్ సుప్రియా నవీన్ గౌడ్
- జలమండలి ఎండీ అశోక్ రెడ్డికి వినతి
ముషీరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): ముషీరాబాద్ లోని పలు ప్రాం తాలలో డ్రైనేజీ పైప్ లైన్ మురుగు నీరు మంచినీటి సరఫరాలో కలవడం వల్ల కలుషిత నీటి సరఫరా జరుగుతున్నదని వెంటనే కలుషిత నీటిని నివారించి ప్రజలకు మెరుగైన మంచినీటిని అందించాలని ముషీరా బాద్ కార్పొరేటర్ సుప్రియా నవీన్ గౌడ్ కోరారు. శనివారం జలమండలి ఎం డీ అశోక్ రెడ్డిని కార్పొరేటర్ కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ముషీరాబాద్ లోని బాపూజీనగర్, కళాధర్ నగర్, పార్శిగుట్ట, వైఎస్‌ఆర్ పార్కు వీధి, జెమినీ కాలనీలో నిత్యం కలుషిత నీటి సరఫరా జరుగుతున్నదని, దీని వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి ప్రతిపాధనలు సైతం సిద్ధం మయ్యాయని తెలిపారు. వెంటనే నిధులు మంజూరు చేసి అద్వాన స్థితికి చేరుకున్న మంచినీటి పైప్లైన్లు ఏర్పాటు చేయా లని కోరారు. జలమండలి ఎండీని కలిసిన వారిలో బీజేపీ ముషీరాబాద్ నియోజకవర్గం జాయింట్ ఎం. నవీన్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు కంచి ముదిరాజ్ పాల్గొన్నారు.