09-08-2025 01:02:07 AM
- ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 8:ఉరేసుకొని ఓ యువ న్యాయవాది ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం సీఐ మద్ది మహేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని చర్ల పటేల్ గూడ కు చెందిన పండాల నరేందర్ గౌడ్(34), ఇబ్రహీంపట్నం కోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్నా డు.
కాగా గురువారం రాత్రి 11 గంటల సమయంలో జెబి వెంచర్ సమీపంలో తన వ్యవసాయ క్షేత్రంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడాడు. కుటుంబ ఆస్తి తగాదల కారణంగా నరేందర్ ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి భార్య తెలిపిందన్నారు. మృతుడు భార్య కూడా న్యాయవాదిగా ఇబ్రహీంపట్నం కోర్టులోనే విధులు నిర్వర్తిస్తుంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఘటన స్థలానికి చేరుకొని బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించినట్లుసిఐతెలిపారు.