09-08-2025 01:06:18 AM
హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలతో గ్రేటర్ విశాఖపట్టణం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)కు రూ.100 కోట్ల నష్టం వాటిల్లిందని కళ్యాణ్ చక్రవర్తి ఆరోపించారు. 2023లో గ్రేటర్ విశాఖపట్ట ణంలో టెండర్ లేకుండానే నామినేషన్ ప్రాతిపదికన యూనిపోల్ ఇన్‌స్టాలేషన్‌ల కోసం వర్క్ ఆర్డర్‌ను జారీ చేయడం తో జీవీఎంసీకు రూ.100 కోట్ల నష్టం వాటిల్లిందని, అనుమతుల జారీ విషయంలో అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు.
ఈమేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి 2024 డిసెంబర్ 6వ తేదీన ఫిర్యాదు చేస్తూ కళ్యాణ్ చక్రవర్తి ఓ లేఖ రాశారు. గత ప్రభుత్వంలో అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంతో జీవీఎంసీ, రాష్ట్ర ఆదాయానికి నష్టం చేకూరిందని ఆరోపిస్తూ ఆ లేఖలో పలు అంశాలను ఆయన ప్రస్తావించారు.
ప్రకాష్ ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, 99 ఇన్ఫో మీడియా, సాయినాథ్ యాడ్స్ అనే కంపెనీలు కుమ్మక్కయి 02/12/ 2022, 08/12/2022 మధ్యన జీవీఎంసీ కమిషనర్ (రాజాబాబు)కు జీవీ ఎంసీలోని అత్యంత ప్రధాన ప్రాంతాలలో యూనిపోల్స్ నిర్మాణం, ప్రకటన ప్రదర్శన కోసం నగర పరిధిలో 200 యూనిపోల్స్ ఏర్పాటు చేయడానికి అనుమతి కోరుతూ రిప్రజెంటేషన్ ఇచ్చాయని పేర్కొన్నారు.
రాజాబాబు ఎటు వంటి మార్కెట్ అధ్యయనం చేయకుండా, ఈ విషయాన్ని సబ్జెక్ట్ నిపుణిడికి సైతం సూచించకుండానే హడావుడిగా పైన పేర్కొన్న కంపెనీలకు హోర్డింగ్‌ల ధరకు నామినేషన్ ఆర్డర్‌లను జారీ చేయడంతోపాటు, మూడు సంవత్సరాల పాటు యూనిపోల్స్/గ్యాంట్రీలకు అనుమతులను మంజూరు చేశారని ఆరోపిం చారు. అంతేకాకుండా ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే(ఎల్‌ఈడీలు) నిర్మాణాలను హోర్డింగ్‌ల ధరను మార్చడానికి కూడా వారికి అనుమతి ఇచ్చారని, చదరపు మీటర్‌కు కోట్ చేసిన ధరల్లోనూ వ్యత్యాసం ఉందని ఆరోపించారు.
ఉదయం, సాయంత్రానికి 80 శాతం రేట్లు తగ్గించారని ఆయన లేఖ లో పేర్కొన్నారు. మున్సిపల్ స్థలాలను ముందస్తుగా వేలం లేకుండా ఇవ్వలేమని, దీన్ని 22-01-2023 తేదీ నాటి అప్పటి సీ సీపీ సురేష్ కుమార్ ఆమోదించినట్లు ఆయ న వెల్లడించారు. సీసీపీ కమిషనర్ నామినేషన్ ఉత్తర్వులను తిరస్కరించినప్పటికీ, అ ప్పటి సీఎంలోని వైఎస్‌ఆర్‌సీపీ అధికారుల మద్దతుతో జీవీఎంసీ పరిమితుల సెంటర్-మీడియన్లలో యూనిపోల్స్ నిర్మాణం ప్రా రంభించారని ఆరోపించారు.
సంవత్సరానికి యూనిట్‌కు 7347 చొప్పున మంజూరు చేసిన దానికంటే 200 రెట్లు ఎక్కువ రేటుతో వాణిజ్య ప్రకటనలను ప్రదర్శించడం ప్రారంభించారని తెలిపారు. ఆతర్వాత ఏప్రిల్ 2023లో రాజాబాబు బదిలీ అ య్యారు. కొత్త కమిషనర్ సాయికాంత్ వర్మ కొత్త కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజబాబు సిఫార్సులను ఆయన పరిశీలించారని, 14/05/2023 తేదీ ప్రకారం ముగ్గు రు నామినీలు సమర్పించిన డిమాండ్ డ్రాఫ్ట్‌లను తిరిగి ఇవ్వమని అధికారులకు ఆదేశించారు.
దీంతోపాటు గ్రేటర్ విశాఖపట్టణం స్టాండింగ్ కౌన్సిల్‌లో వీటిపై తీసుకున్న నిర్ణయాలు, చర్యలు గురించి కూడా ఆయన లేఖలో వివరంగా ప్రస్తావించారు. కౌన్సిల్ చేసిన తీర్మానానికి విరుద్దంగా వెళ్లడం ద్వా రా కార్పొరేషన్ ఆదాయానికి భారీ నష్టాన్ని పలువురు అధి కారులు కలిగించారని ఆరోపించారు. గత జీవీఎంసీ కమిషనర్ల పదవీకా ంలో సమర్పించిన నివేదికల ద్వారా వాస్త వాలను త్వ రితంగా పరిశీలించి చర్యలు తీ సుకోవాలని ఏపీ ప్రభుత్వానికి, మున్సిపల్ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
ఈ మూ డేండ్లలో కార్పొరేషన్‌కు జరిగిన రూ.100 కో ట్లకుపైగా నష్టం నుండి కాపాడటానికి తగి న చర్యలు తీసుకోవాలని కోరారు. ఇ లాంటి చ ర్యలతో రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీ లు, కార్పొరేషన్‌లలో ఇదే విధానాన్ని అనుసరించడానికి, దోచుకోవడానికి ఆస్కార ముం టుందని తెలిపారు. వైఎస్‌ఆర్‌సీ పీ పాలన లో ఈ తరహా సహాయం పొందిన కంపెనీ లు ప్రస్తుత వ్యవస్థలు, అమల్లో ఉన్న విధానాలను భ్రష్టుపట్టించకుండా అనుమ తి ంచొద్దని ఏపీ ఎంఏయూడీ మంత్రితోపాటు, సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు.