calender_icon.png 9 August, 2025 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోతమోగనున్న బీటెక్ ఫీజులు!

09-08-2025 12:59:46 AM

  1. కాలేజీలను బట్టి ఫీజులు ఖరారు
  2.    50 శాతం వరకు పెరిగే అవకాశం
  3. మామూలు కాలేజీల్లో మాత్రం యథావిధి
  4. ప్రతిపాదిత ఫీజులు కాకుండా స్వల్పంగా పెంచేందుకు ఫీజుల కమిటీ యోచన
  5. ప్రభుత్వానికి సిపార్సులు చేయనున్న అధికారులు

హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): ఇంజినీరింగ్‌తోపాటు ఇతర వృత్తివిద్యా కోర్సుల ఫీజుల మోతతప్పేలా కనిపించడం లే దు. రాబోయే మూడేళ్లకు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులు పెరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే కాలేజీలను విచారించి టీఏఎఫ్‌ఆర్‌సీ ప్రభుత్వానికి సిఫార్సు చేసిన ఫీజులు కాకుండా కొంతమేర ఫీజులు పెరగనున్నట్టు అధికారికవర్గాలు పేర్కొన్నాయి. ఫీజుల పెరుగుదల రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో కాకుం డా కొన్నింటిలో మాత్రమే ఉండే అవకాశం ఉంది.

2025-26, 2026-27, 2027-28 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఫీజుల ఖరారుకు వేసిన ఫీజుల కమిటీ దీనిపై తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పాత ఫీజుల ప్రకారమే కౌన్సెలింగ్ చేపడుతున్న అధికారు లు.. ఈనెల 10న తుది విడత ఇంజినీరింగ్ సీట్లను కేటాయించడంతో ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రవేశాలు దాదాపు ముగిసినట్టువుతుంది. ఆ తర్వాత విద్యార్థులకు ఫస్ట్ సెమిస్టర్ తరగతులు ప్రారంభిం చాల్సి ఉంటుంది.

ఈలోగా ఫీజుల అంశాన్ని కమిటీ తేల్చాల్సి ఉంది. ఆయా కాలేజీలకు గతంలో ప్రతిపాదించిన ఫీజులను అలానే పెంచకుండా ఒక్కో కాలేజీకు వాటి గ్రేడ్లను బట్టి పెంచాలని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) ఇప్పటికే ఆయా కాలేజీల ఫీజులను ఖరారు చేసి ప్రభుత్వానికి సి ఫార్సు చేయగా, ఈ ఫీజుల విధివిధానాల ఖ రారుకు ఫీజుల కమిటీని ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీ రెం డుసార్లు ఫీజులపై సమావేశమైంది.

50 శాతం వరకు..

ఇంజినీరింగ్ కోర్సుకు కాలేజీలు అడుగుతున్న ఫీజులు చూస్తే ఆశ్చర్యమేయకమా నదు. కొన్ని కాలేజీలు స్వల్పంగానే ఫీజులు పెంచాలని కోరుతున్నా.. మరికొన్ని కాలేజీలైతే భారీగా ఫీజులు పెంచాలని అడుగుతుం డటం గమనార్హం. పలు టాప్ కాలేజీలైతే ఏకంగా 80 శాతం పెంచాలని కోరుతుంటే, మరికొన్ని మాత్రం 30 నుంచి 50 శాతం పెంచాలని  విచారణ సమయంలో టీఏఎఫ్‌ఆర్‌సీకి ప్రతిపాదించాయి.

సీబీఐటీ కాలేజీ రూ.2.94 లక్షల ఫీజును ప్రతిపాదించగా, దా న్ని టీఏఎఫ్‌ఆర్‌సీ రూ.2.23 లక్షలకు గతం లో ఖరారు చేసింది. వీఎన్‌ఆర్ విజ్ఞానజ్యోతి కాలేజీ రూ.2.84 లక్షలు ప్రతిపాదించగా దాన్ని రూ.2.20 లక్షలుగా ఖరారు చేసిం ది. ఈ ఫీజులను ప్రభుత్వానికి టీఏఎఫ్‌ఆర్‌సీ సిఫార్సు చేయడంతో అసాధారణంగా ఫీజు లు ఉన్నాయని భావించిన ప్రభుత్వం ఫీజుల కమిటీతో ఆయా కాలేజీల్లో అందుతున్న విద్యాప్రమాణాల ద్వారా వాటిని మరోసారి పరిశీలించాలని నిర్ణయించింది.

ప్రస్తుతం ఫీజుల కమిటీ ఆ పనిలో నిమగ్నమైంది. నా లుగు సబ్ కమిటీల ద్వారా ఫీజుల విధివిధానాలు రూపొందిస్తోంది. అయితే నైపుణ్యమై న ఫ్యాకల్టీ, వసతులు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ న్యాక్ అక్రిడియేషన్, ఎన్‌బీఏ గుర్తింపు ఉన్న కాలేజీలకు ఫీజులు పెరిగే అవకాశముంది. ఈ రకమైన కాలేజీ లు స్వల్పంగానే ఉండనున్నట్టు తెలుస్తోం ది. 10 నుంచి 50 శాతం వరకు ఫీజులు పెరిగే అవకాశం ఉంది.

తప్పనిసరిగా ఫీజులు పెం చాల్సిన పరిస్థితి రావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యాప్రమాణాలు పాటించని మామూలు కాలేజీల్లో పెద్దగా ఫీజులను పెంచకుండా పాత ఫీజులనే కొనసాగించేలా ప్రభుత్వానికి ఫీజుల కమిటీ సిఫా ర్సు చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఎం తో కొంత ఫీజులు పెంచకుంటే కాలేజీలు ఒ ప్పుకొనే పరిస్థితి కనిపించడం లేదు.

ప్రైవేట్, డీమ్డ్ వర్సిటీల నుంచి పెరిగిన పోటీ, పెరిగిన ధరలు, ఖర్చులకు అనుగుణంగా ఫీజులు పెంచాలని కాలేజీలు కోతున్నాయి. ఫీజులు పెంచకుండా నైపుణ్యమైన ఫ్యాకల్టీ, మంచి వసతులు ఎలా కల్పించాలని ప్రశ్నిస్తున్నా యి. ఈ విషయంలో మరోసారి న్యాయస్థానికి ఆశ్రయించే అవకాశమూ ఉంది. ఒకవేళ కొత్త ఫీజులు అమల్లోకి వస్తే ప్రస్తుతానికి పా త ఫీజులతో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఆ మేరకు అదనపు ఫీజులు చెల్లించాలి.