calender_icon.png 5 December, 2024 | 1:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య

29-10-2024 08:53:42 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): అప్పుల బాధతో జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి బాలాజీ నగర్ లో జరిగింది. ఇన్ స్పెక్టర్ పరశురాం వివరాల ప్రకారం... ఘట్ కేసర్ మున్సిపాలిటీ బాలాజీ నగర్ కు చెందిన బర్ల శివకుమార్ ముదిరాజ్(32) ప్రవేటు ఉద్యోగి, తండ్రి కిష్టయ్య మృతి చెందడంతో తల్లి, అన్నతో కలిసి ఉంటున్నాడు.  ఇంటి నిర్మాణం చేపట్టడంతో అప్పుల పాలయ్యాడు. చేసిన అప్పులు తీర్చాలని  ఒత్తిడి చేయడంతో వారం రోజులుగా ఎవరితో మాట్లాడకుండా డిప్రెషన్ లో ఉన్నాడు. మంగళవారం ఉదయం ఎవరికి చెప్పకుండా ఘట్ కేసర్ శివారులోని చిన్న చెరువు వద్దకు వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పు పట్టించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి వెళ్లి బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.