calender_icon.png 22 July, 2025 | 6:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శిక్షణలోనే తనువు చాలించిన యువ జవాన్..

22-07-2025 12:48:09 AM

ఆదిలాబాద్, బజార్హత్నూర్, జూలై 21 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా బజార్హ త్నూర్ మండలలోని వర్తమన్నూర్ గ్రామానికి చెందిన నలువల ఆకాష్ అనే యువ కుడు ఆర్మీలో శిక్షణ పొందుతున్న క్రమంలో అకాల మరణం ఆ కుటుంబాన్ని  విషాదంలోకి నెట్టేసింది. 6 నెలల క్రితం ఆర్మీ ఉద్యో గానికి ఎంపికైన ఆకాష్ అస్సాం లో జవాన్ గా శిక్షణ తీసుకుంటున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. శిక్షణ క్రమంలో భాగంగా ఆదివారం 20 కిలో మీటర్ల రన్నింగ్ చేస్తుండగా ఆకాష్ ఒక్కసారి కుప్ప కూలిపోయాడు.

గమనించిన శిక్షణ అధికారులు ఆ యువకుడిని హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించా రు. కానీ అప్పటికి ఆకాష్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని శిక్షణాధికారులు ఆకాష్ కుటుంబానికి సమాచారం అందించారు. యువకుని అకాల మరణం తో ఆ కుటుంబం శోకసముద్రంలో మునిగిపొయింది. యువకుని మృతదేహంను ఆయన స్వగ్రామమైన వర్తమన్నూర్ తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆకాష్ అకాల మరణంతో తన స్నేహితులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆకా ష్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఆగస్టు 7న ఓబీసీ జాతీయ మహా సభలు

మందమర్రి, జూలై 21 : గోవాలో ఆగస్టు 7న జరిగే ఓబీసీ 10వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండిల్ల శ్రీనివాస్, పట్టణ యూత్ అధ్యక్షులు ముడారపు శేఖర్ కోరారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవా రం చలో గోవా పోస్టర్లను ఆవిష్కరించి వారు మాట్లాడారు. మేమెంతో.. మాకంత.. అనే నినాదంతో  హక్కుల కోసం పోరాడి విజయాలు సాధించుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ నాయకులు తడిగొప్పుల రవిరాజా, జాడ క్రాంతి కుమార్, చెప్పాల రమేష్, కలీం, యోగానంద రావు, సంపత్, కలీల్, ఎర్రన్న, యాదగిరి, చింతల రమేష్, యూత్ నాయకులు గరిగె సుమన్, ముష్కే అఖిల్, శ్రావణ్, అర్కటి రవీందర్, అనిల్, ఒమేశ్వర్ లు పాల్గొన్నారు.