22-07-2025 12:49:00 AM
నిధులను మంజూరు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్
వేములవాడ టౌన్:జూలై 21 (విజయక్రాంతి)వేములవాడ బ్రాహ్మణ నిత్యాన్న సత్రం నిర్మిస్తున్న అన్నదాన భవనానికి కేంద్ర మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కు మార్ నిధులతో బోరు మోటారు పనులు సోమవారం ప్రారంభమయ్యాయి.
భవన నిర్మాణానికి నిధుల అవసరం ఉండగా, బ్రాహ్మణ సత్రం సభ్యులు, బీజేపీ పట్టణ శాఖ నాయకులు కలిసి బండి సంజయ్ ని కలిసిన వెంటనే ఆయన స్పందించి రూ. ఐదు లక్షల నిధులు మంజూరు చేసి ప్రొసీడింగ్స్ జారీ చేశారు. అంతేకాకుండా, బోరింగ్‌వేసి మోటారు అమర్చే బాధ్యతను కూడా స్వీకరించిన బండి సంజయ్ ఇచ్చిన మాట మేరకు ఈరోజు భూమి పూజ అనంతరం బోరు పనులను ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రతాప రామకృష్ణ పూజా కార్యక్రమాలు నిర్వహించి, బోరింగ్ పనులకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్, బ్రాహ్మణ సత్రం సభ్యులు, బీజేపీ పట్టణ శాఖ నాయకులు, కార్యకర్తలు, స్థానిక పెద్దలు పెద్ద సంఖ్యలోపాల్గొన్నారు.