calender_icon.png 3 August, 2025 | 12:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గొర్రెల పంపిణీ లో జరిగిన కోట్ల రూపాయల అవినీతి, అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలి

02-08-2025 09:29:57 PM

 తెలంగాణ గొర్రెల,మేకల పెంపకం దారుల సంఘం (జిఎంపిఎస్ ) జిల్లా గౌరవ సలహాదారులు మట్టిపెల్లి సైదులు

 సూర్యాపేట,(విజయక్రాంతి): గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ లో జరిగిన కోట్లాది రూపాయల అవినీతి, అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం (జిఎంపిఎస్ ) జిల్లా గౌరవ సలహాదారులు మట్టిపల్లి సైదులు అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎం వి ఎన్ భవన్ లో జరిగిన తెలంగాణ గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రంలో గొర్రెల పంపిణీలో 1000 కోట్లకు పైన అవినీతి అక్రమాలు జరిగాయని ఈడి గుర్తించిందన్నారు. గొర్రెల మేకల పెంపకం దారులకు వెళ్ళవలసిన నిధులు ప్రైవేటు వ్యక్తుల బ్యాంకు ఖాతాలకు వెళ్లినట్టు నిర్ధారణ అయిందన్నారు. ఇటీవల ఈడి చేపట్టిన దాడులలో అనేక కీలక ఆధారాలు లభించాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా గొర్రెల పంపిణీలో అవినీతి అక్రమాలు జరిగాయన్నారు. ఈడి ప్రత్యేక దృష్టి పెట్టి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన అక్రమాలను వెలికి తీయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గొర్రెల వ్యాక్సిన్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా విక్రయాలు జరుగుతున్నాయని వీటిపై జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు దృష్టి పెట్టి ఆంధ్ర వ్యాక్సిన్ అమ్ముతున్న వారిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఇటీవల కురిసిన వర్షాల మూలంగా గొర్రెలు, మేకలు రోగాల బారిన పడుతున్నాయని ప్రభుత్వం వెంటనే గొర్రెల మేకలకు మందల వద్దని వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఖాళీగా ఉన్న వెటర్నరీ డాక్టర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. తెలంగాణ గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిఎంపిఎస్ జిల్లా గౌరవ అధ్యక్షులు వీరబోయిన రవి, జిఎంపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల రమేష్, ఉపాధ్యక్షులు కంచు గట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.