02-08-2025 09:37:30 PM
నాగారం: నాగారం మండల పరిధిలోని ఫణిగిరి గ్రామానికి చెందిన ఆకారపు రావులమ్మ కు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం ఎమ్మెల్యే మందుల సామేల్ కు తెలియజేయడంతో మెరుగైన వైద్యం కోసం ఎల్ఓసి రూ.2.50 లక్షల మంజూరు పత్రమును శనివారం ఫణిగిరి గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాములమ్మ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ... విషయం తెలియజేయగానే మానవత్వంతో స్పందించిన ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.