02-08-2025 09:51:13 PM
మోతే: శుక్రవారం జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్(SP Narasimha IPS) మోతే మండల పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ లోని పరిసరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ డైరీ, రిషప్షెన్ రిజిష్టర్ ని తనిఖీ చేసి మండల పరిధిలో నమోదవుతున్న నేరాలు, పిర్యాదుల తీరుతెన్నులు, కేసుల స్థితిగతులు మొదలగు అంశాలను పరిశీలించారు. పోలీసు సిబ్బంది ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి, పారదర్శకంగా పని చేయాలి, బాధితులకు సత్వర సేవలు అందించాలని ఆదేశించారు, నాణ్యమైన వేగవంతమైన దర్యాప్తు చేయాలని బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు.
గ్రామ రిజిస్టర్లు, హిస్టరీ షీట్స్, రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ ను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని అన్నారు. బ్లూ కొట్ విధులు, ప్రెట్రో కార్ విధులు ప్రధానమైనవి సంఘటన స్థలాన్ని త్వరగా చేరుకుని ప్రాథమికంగా బాధితులకు భరోసా కల్పించాలని సూచించారు. కేసులు పెండింగ్ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి తెలిపారు, జట్టుగా పనిచేస్తూ లక్ష్యంతో ముందుకెళ్తే పోలీసు అనుకున్న విజయాలను సాధించవచ్చు అని ఎస్పీ కోరారు.