02-08-2025 09:43:11 PM
రామచంద్రపురం: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం లోని ప్రధాన రహదారిపై గల మారుతి సుజుకీ షోరూం ముందర గత రెండు నెలలుగా మంచినీటి పైపులైన్లు పగిలిపోయి నీరు డ్రైనేజీలోకి వృధాగా పోతున్నా, హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు పట్టించుకునే నాథుడే కరువయ్యారు. మిషన్ భగీరథ నీటి సరఫరా పైపులైన్లు ఎక్కువగా దెబ్బతింటున్నాయని, వాటి మరమ్మతులు చేపట్టడంలో హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మంచినీరు వృధాగా పోతున్న ప్రాంతాలలో ప్రజలు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ, ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని, ఇప్పటికైనా హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు నిద్రమత్తు వీడి నీటి వృధా జరగకుండా, రోడ్లు పాడవకుండా, ప్రజలకు సరిపడా నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.