calender_icon.png 3 August, 2025 | 12:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

02-08-2025 09:39:55 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): విద్యార్థులకు చదువే లక్ష్యం కావాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని బయ్యారం ఎస్ ఐ కోగిల తిరుపతి విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో సైబర్ నేరాలు, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్ధాలను వివరించారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరించారు. సోషల్ మీడియా, ఇంటర్నెట్ వినియోగం, ఫేక్ న్యూస్ పై వివరించారు. సమాజ సేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.