calender_icon.png 3 August, 2025 | 12:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బసవతారకంలో జర్నలిస్టులకు వైద్య సేవలు అందించండి

02-08-2025 09:26:40 PM

నామాకు టియుడబ్ల్యూజె (ఐజెయు) వినతి

ఖమ్మం,(విజయక్రాంతి): బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో జర్నలిస్టుల హెల్త్ కార్డ్  చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవడంతో పాటు జర్నలిస్టులకు వీలైనంత మేర ఉచిత వైద్యం అందెలా చూడాలని టియుడబ్ల్యూజె (ఐజెయు) ఆధ్వర్యంలో మాజీ ఎంపి బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ ట్రస్టీ నామా నాగేశ్వరరావుకు శనివారం వినతి పత్రం అందజేశారు.

ఇటీవల కాలంలో క్యాన్సర్ సంబంధిత వ్యాధుల బారీన జర్నలిస్టు కుటుంబాలు పడుతున్న నేపథ్యంలో వైద్య ఖర్చులు భరించడం ఇబ్బందికరంగా మారిందని వారు వినతి పత్రంలో పేర్కొన్నారు. వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించేలా చూడాలని జర్నలిస్టుల హెల్త్ కార్డ్  చెల్లుబాటయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన నామ ఈ విషయమై క్యాన్సర్ ఆసుపత్రి నిర్వాహకులతో మాట్లాడి జర్నలిస్టులకు బసవతారకం ఆసుపత్రి ద్వారా వీలైనంత మేర జర్నలిస్టు కుటుంబాలకు ఉచితంగా వైద్య సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.