02-08-2025 09:49:25 PM
తప్పిన పెను ప్రమాదం..
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండల(Valigonda Mandal) కేంద్రంలోని వలిగొండ గుట్ట సమీపంలో గల కౌడే కృష్ణకు చెందిన ఇంటిలోకి శనివారం రాత్రి భారీ కొండచిలువ శబ్దాలు చేస్తూ ప్రవేశిస్తుండగా అప్పుడే ఇంటిలోకి వెళుతున్న కృష్ణ గమనించి కేకలు వేశారు. దీంతో ఇంటి ముందు గల మాజీ ఉప సర్పంచ్ పబ్బు సురేందర్, ఇంటి యజమాని కృష్ణ మరికొందరు గ్రామస్తులతో కలిసి భారీ కొండచిలువను కర్రలతో కొట్టగా వారిపై దూసుకు వచ్చిన కొండచిలువను వారంతా కలిసి చాకచక్యంగా మట్టుబెట్టారు. కొండచిలువను గుర్తించకపోయినట్లయితే కృష్ణ ఇంటిలోకి కొండచిలువ ప్రవేశిస్తే రాత్రి వేళలో ఇంట్లో ఉన్నవారికి ప్రమాదం జరిగి ఉండేదని కొండచిలువ చనిపోవడంతో గుట్ట సమీపంలోని వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రాంతంలో దాదాపు పది అడుగుల మేరకు ఉన్న భారీ కొండచిలువ మొదటిసారిగా చూస్తున్నామని అది చనిపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు అయిందని గ్రామస్తులు అన్నారు.