02-08-2025 09:32:28 PM
రాష్ట్ర గనులు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి
మందమర్రి,(విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని రాష్ట్ర గనులు, కార్మిక శాఖ మంత్రి జి వివేక్ వెంకటస్వామి కోరారు. పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం ఆవరణలో శనివారం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటి మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్యం పెరుగుతుందని తద్వారా ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతు న్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కలను విరివిగా నాటడం మూలంగా వాతావరణ కాలుష్యం అరికట్టవచ్చని ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటి సంరక్షణకు కృషి చేయాల న్నారు. పర్యావరణ పరిరక్షణ కోరుతూ యూత్ కాంగ్రెస్ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని యూత్ కాంగ్రెస్ నాయకులను అభినందించారు.