calender_icon.png 3 August, 2025 | 12:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదుపుతప్పి ఆటో బోల్తా..

02-08-2025 09:47:02 PM

తూప్రాన్ (విజయక్రాంతి): అదుపుతప్పి ఆటో బోల్తా కొట్టిన ఘటన వెల్దుర్తి మండలం(Veldurthi Mandal) నెల్లూరు గంగమ్మ దేవాలయ సమీపంలో చోటుచేసుకుంది. తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు.. వివరాలు ఇలా ఉన్నాయి. వెల్దుర్తిలో జరుగుతున్న అంగడికి వివిధ గ్రామాలవారు చేరుకొని వస్తువులను సేకరించి తిరిగి ప్రయాణమై వస్తుండగా వెల్దుర్తి నెల్లూరు మార్గమధ్యలో రోడ్డుపైన గుంతను గమనించకపోవడంతో అదుపుతప్పి ఆటో బోల్తా కొట్టింది. హుటాహుటిన క్షత గాత్రులను తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇందులో నాగమణి అనే మహిళ కాలుకు తీవ్ర గాయం కాగా దుర్గయ్య, మహేష్ తలకు గాయాలయ్యాయి, వీరిని హైదరాబాదులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించడం జరిగింది. ఇంకొక ఇద్దరికీ అతి స్వల్ప గాయాలు కాగా చికిత్స అందిస్తున్న తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రి. వైద్యులు. వెల్దుర్తి పోలీసులు దర్యాప్తు చేపట్టి కేసు నమోదు చేసుకోవడం జరిగింది.