calender_icon.png 15 July, 2025 | 11:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థి పాలకవర్గ ఎన్నికలు

15-07-2025 05:45:12 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని స్థానిక విజయ ఉన్నత పాఠశాలలో  విద్యార్థి పాలకవర్గ ఎన్నికలు (స్టూడెంట్ గవర్నింగ్ బాడీ ఎలక్షన్స్) నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా విద్యార్థిని-విద్యార్థులకు ఎన్నికల పట్ల అవగాహన, ఓటు హక్కు ప్రాధాన్యత, నామినేషన్లు దాఖలు చేయడం, బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేయడం ,ఓట్ల లెక్కింపు తదితర విషయాలపై అవగాహన కల్పించడం జరిగింది.

ఈ సందర్భంగా విద్యార్థులు ఓటర్లుగా తగిన అభ్యర్థిని ఎన్నుకోవడానికి వారి యొక్క ఓటు అనే బాధ్యతని సద్వినియోగపరు కోవాలని సిఐ ప్రవీణ్ కుమార్ అన్నారు. పాఠశాల సెక్రెటరీ అయ్యన్న భూమయ్య ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ... ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం అని, న్యాయకత్వ  లక్షణాలు పెంపొందించుకోవాలని తమ యొక్క విధిని, బాధ్యతని తప్పకుండా నిర్వహించాలని తెలిపారు.