calender_icon.png 16 July, 2025 | 12:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వశిష్ట పాఠశాలలో గోరింటాకు సంబరాలు

15-07-2025 05:50:27 PM

నిర్మల్,(విజయక్రాంతి): స్థానిక వశిష్ట హై స్కూల్ ఆదర్శ్ నగర్ యందు పర్యావరణ రక్షణ కొరకు మొక్కల పెంపకం ప్రాముఖ్యతను తెలియజేస్తూ విద్యార్థిని విద్యార్థులు మొక్కలు నాటారు. ఆషాఢమాసాన్ని పురస్కరించుకొని పాఠశాలలో విద్యార్థినిలు గోరింటాకు లు పెట్టుకుని సంబరాలు  మంగళవారం చేసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పర్యావరణంలో మొక్కల యొక్క ప్రాముఖ్యతను మనవ జీవనంలో మొక్కల ప్రాధాన్యత గురుంచి వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మాధవి, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.